డ్రైవర్, అసిస్టెంట్ తో కలిసి రోడ్డు పక్కన భోజనం చేసిన జగపతిబాబు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్న నటుల్లో జగపతిబాబు ఒకరు.  ఒకప్పుడు స్టార్ హీరోగా చేసిన ఆయన ఇప్పుడు విలన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా రాణిస్తున్నారు. ఎలాంటి పాత్ర చేసినా చూడా సినిమాలో హైలెట్ అయ్యేలా చూసుకుంటారు. అంతకే కాదు మంచితనం క్రమశిక్షణ కలిగిన నటుడు కూడా.. ఇంత క్రేజ్ ఉన్న జగపతి బాబు చాలా సింపుల్ గా ఉంటారు. 

ఇటీవల ఆయన అసిస్టెంట్, డ్రైవర్లతో నడుచుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంది. తన డ్రైవర్, అసిస్టెంట్ తో కలిసి రోడ్డు పక్కన ఉన్న ఓ దాబాలో భోజనం చేశారు. తన అసిస్టెంట్ తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత ఇలా తిన్నామని జగపతిబాబు చెప్పుకొచ్చారు.  

ఇక జగపతిబాబు ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. స్టార్ హీరో అయినా.. జగపతి ఎంతో సింప్లిసిటీని మెయింటైన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ను మన దగ్గర పనిచేసేవాళ్లను ఎలా చూడాలో జగపతిబాబును చూసి నేర్చుకోండి అని ఇతర సెలబ్రెటీలను టార్గెట్ చేస్తు మరి కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

 

 

Leave a Comment