మేనమామకు షాక్ ఇచ్చిన మేనల్లుడు.. ఏకంగా అత్తను పెళ్లి చేసుకున్నాడు..!

ఓ యువకుడు తన మేనమాటకే షాక్ ఇచ్చాడు. మేనమామ భార్యను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ కు చెందిన రాకేష్ శర్మ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ముంబైలో కొత్తగా కాపురం పెట్టాడు. ముంబైలోనే శర్మ మేనల్లుడు చందన్ ఆటో రిక్షా నడుపుతంటాడు. దీంతో అప్పుడప్పుడు మేనమామ ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. 

ఈక్రమంలో చందన్ కు, అతని అత్తకు మధ్య ప్రేమ చిగురించింది. ఓ రోజు తన భార్య, మేనల్లుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు రాకేష్ చూశాడు. వాళ్లిద్దరినీ మందలించాడు. ఈ విషయం వాళ్ల కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో మేనల్లుడు మళ్లీ వాళ్ల ఇంటికి రాలేదు. 

కానీ అత్త మాత్రం మేనల్లుడిని విడిచి ఉండలేకపోయింది. ఒకరోజు భర్త ఇంట్లో లేని సమయంలో మేనల్లుడితో జంప్ అయిపోయింది. వారిద్దరు కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment