టీటీడీ గుడ్ న్యూస్.. శ్రీవారి భక్తులకు ‘ధన ప్రసాదం’..!

తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి ‘ధర ప్రసాదం’ పేరుతో చిల్లర నాణెల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి భక్తులకు అందిస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన నాణెలను తిరిగి భక్తులకు శ్రీవారి ధన ప్రసాదంగా ఇస్తోంది.

శ్రీవారికి నిత్యం లభించే హుండీలో భక్తులు చిల్లర నాణేలను కూడా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. చిల్లర నాణేలను తీసుకనేందుకు బ్యాంకులు ముందుకు రావడంం లేదు. దీంతో టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. నాణేలను నోట్ల రూపంలో మార్చుకునేందుకు శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో 100 రూపాయల చిల్లర నాణేలను ప్యాకెట్లలో భక్తులకు అందిస్తోంది. 

భక్తులకు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధన ప్రసాదాన్ని తిరుమల కొండపై కౌంటర్లలో కూడా అమ్ముతున్నారు. కవర్ లో కాయిన్స్ తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు. వంద రూపాయలు చెల్లించి ఆ ధన ప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసినట్లుగానే ఈ చిల్లర నాణేల ప్రసాదం తీసుకోవచ్చు. ప్రస్తుతం రూపాయి నాణేలు మాత్రమే ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2,5 రూపాయల నాణేల ప్యాకెట్లను కూడా టీటీటీ అందుబాటులోకి తీసుకురానుంది.   

Leave a Comment