హీరో రోహిత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కెరీర్ ప్రారంభంలో హిట్స్ కొట్టిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కెరీర్ ముగించిన వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే అలాంటి కొంద మంది హీరోలు ఇప్పుడు కనబడితే గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. అలాంటి వారిలో రోహిత్ కూడా ఒకరు.. 

రోహిత్ 16 అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం.. ఓ రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలైతే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. రోహిత్ నటించిన సినిమాల్లోని పాటలు యూత్ ని ఒక్క ఊపు ఊపేవి.. రోహిత్ కు యూత్ లో అంత క్రేజ్ ఉండేది. కానీ ఆ తర్వాత రోహిత్ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. 

కెరీర్ ఆరంభంలో రోహిత్ కు రెండు మంచి హిట్లు వచ్చానా.. తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. తనకు తగ్గ స్టోరీలను ఎంచుకోవడంతో విఫలమయ్యాడు. దీంతో ఎంత తొందరగా ఎదిగాడో.. అంతే తొందరగా కెరీర్ ముగించాడు. అయితే చాలా కాలం తర్వాత రోహిత్ లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో రోహిత్ ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. 

ఇదిలా ఉంటే రోహిత్ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. ‘కళాకర్’ అనే సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత రోహిత్ మంచి పాత్రలు దొరికితే సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరీ రీ ఎంట్రీ తర్వాత హీరో రోహిత్ కెరీర్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..

 

Leave a Comment