మనం నిత్యం ఉపయోగించే కొన్ని ప్రొడక్ట్స్.. విదేశాల్లో బ్యాన్ చేశారని తెలుసా? అవేంటో ఒకసారి చూడండి..!

మనం నిత్యం ఉపయోగించి కొన్ని ఉత్పత్తులు విదేశాలలో బ్యాన్ చేశారు. కానీ భారతదేశంలో మాత్రం వాటిని నిత్యం ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే విదేశాలలో బ్యాన్ చేసి మన ఇండియాలో ఉపయోగిస్తున్న ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1.లైఫ్ బాయ్ సోప్:

మన దేశంలో లైఫ్ బాయ్ సబ్బును చాలా మంది ఉపయోగిస్తున్నారు. కానీ యునైటెడ్ స్టేట్స్ లో లైఫ్ బాయ్ సబ్బును బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ సబ్బు ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది.. ఈ సబ్బును అక్కడ కొన్ని జంతువులకు స్నానం చేయించడానికి వాడుతారు.  కానీ భారతదేశంలో మాత్రం ఈ సబ్బుకు మంచి డిమాండ్ ఉంది..

2.రెడ్ బుల్:

ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ ఫ్రాన్స్ మరియు డెన్మార్క్ దేశాల్లో బ్యాన్ చేశారు. ఇందులో టౌరిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. అందువల్ల దీనిని అక్కడ బ్యాన్ చేశారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ ఎనర్జీ డ్రింక్ విపరీతంగా అమ్ముడుపోతుంది. 

3.డిస్ప్రిన్:

మనకు తల నొప్పి వచ్చినప్పుడు ఉపశమనం కోసం డిస్ప్రిన్ ని వేసుకుంటాము.. కానీ ఈ టాబ్లెట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అందువల్ల అమెరికా, ఐరోపా దేశాల్లో డిస్ప్రిన్ ని బ్యాన్ చేశారు. 

4.పురుగుల మందు:

పురుగుల మందులను విదేశాలలో బ్యాన్ చేశారు. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని 400 రకాల పెస్టిసైడ్స్ ని అక్కడ బ్యాన్ చేశారు. అయితే అక్కడ నిషేధించిన 60 రకాల పెస్టిసైడ్స్ ని భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. 

5.పచ్చి పాలు:

పాశ్చరైజ్ చేయని పాలను అమెరికా, కెనడా దేశాల్లో ఉపయోగించడం నిషేధించారు. ఎందుకంటే ఇందులో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మరియు జెర్మ్స్ ఉన్నాయి. ఇవి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం ఇది మార్కెట్ లో అమ్ముతుంటారు.

6.జెల్లీ స్వీట్స్:

అమెరికా, కెనడా మరియు ఆస్ట్రేలియా దేశాల్లో జెల్లీ స్వీట్స్ ని బ్యాన్ చేశారు. ఇది పిల్లల ఆరోగ్యానికి హానికరమట. అందుకే అక్కడ నిషేధించారు. కానీ భారతదేశంలో మాత్రం పిల్లల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా జెల్లీ స్వీట్స్ ని విరివిగా అమ్ముతుంటారు. 

7.నిమ్సిలిడ్:

నిమ్సిలిడ్ టాబ్లెట్లను అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల్లో ఈ పెయిన్ కిల్లర్ ని బ్యాన్ చేశారు. ఈ పెయిన్ కిల్లర్ కాలేయానికి హానీకరమట.. కాబట్టి చాలా దేశాల్లో దీనిని అధికారికంగా నిషేధించారు. కానీ ఇండియాలోని మెడికల్ షాపుల్లో మాత్రం ఇది ఈజీగా లభిస్తుంది..

8.డీ-కోల్డ్ టోటల్:

మనం జలుబుకు వాడే డీ-కోల్డ్ టోటల్ మెడిసిన్ కిడ్నీకి హానికరమట. అందుకే చాలా దేశాల్లో ఈ మెడిసిన్ ని బ్యాన్ చేశారు. కానీ భారతదేశంలో మాత్రం టీవీ చూస్తున్నప్పుడు దీని యాడ్ వస్తుంటుంది. 

9.Alto 800:

భారతదేశంలో మధ్య తరగతి కుటుంబాలు ఆల్టో 800 కారును ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ కారు నానో కారు లాగానే గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అందుకే చాలా దేశాల్లో ఈ కారును బ్యాన్ చేశారు. 

10.కిండర్ జాయ్:

మన దేశంలో కిండర్ జాయ్ ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ కిండర్ జాయ్ పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా నిపుణులు సూచించారు. దీంతో యూఎస్ లో కిండర్ జాయ్ ని బ్యాన్ చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా అమ్మితే 2,500 డాలర్ల జరిమానా కూడా విధిస్తారు.    

 

 

Leave a Comment