పుష్ప సినిమాపై గరికపాటి ఫైర్.. ఆ డైలాగ్ శ్రీరాముడు లాంటివారు వాడాలి..!

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.. ఆ సినిమాలోని డైలాగ్స్, డ్యాన్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తగ్గేదేలా అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు.. అయితే ఈ సినిమాపై ప్రవచన కర్త, అవధాని గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటించాడు. అల్లు అర్జున్ యాటిట్యూడ్, చిత్తూరు యాసలో డైలాగులు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన నటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో గరికపాటి నరసింహారావు పుష్ప సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పుష్ప సినిమాలో హీరో ఒక స్మగ్లర్ అని, స్మగ్లర్ ని హీరో చేసి చూపించారని గరికపాటి మండిపడ్డారు. చివరి ఐదు నిమిషాల్లో హీరోను మంచిగా చూపిస్తామనో లేదా రెండో పార్టులో మంచిగా చూపిస్తామనో అంటారని.. అప్పటి వరకు సమాజం చెడిపోదా అని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ‘తగ్గేదేలే’ అంటూ డైలాగ్ చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ డైలాగ్ ప్రస్తుతం సమాజంలో ఓ సూక్తి లాగా మారిపోయిందని, ఎవరైనా కుర్రాడిని కొడితే తగ్గేదేలే అని అంటాడని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. హీరో అల్లు అర్జున్ కానీ, డైరెక్టర్ సుకుమార్ కానీ తనకు సమాధానం చెప్పమనండని, మొత్తం కడిగేస్తా అని గరికపాటి విమర్శించారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. తగ్గేదేలే అనే మాట శ్రీరాముడు, హరిశ్చంద్రుడు లాంటి వారు వాడాలని, అంతేకానీ ఒక స్మగ్లర్ వాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Leave a Comment