పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మేశాడు..!

కరోనా వైరస్ కారణంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు పేద, మధ్య తరగతి కుటుంబాల వారీకి భారంగా మారాయి. ఎందుకంటే ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. హిమాచల్ ప్రదేశ్ లో తమ పిల్లల చదువు కోసం ఓ తండ్రి చేసిన పని అందరినీ కలిచివేస్తోంది. తమ ఇద్దరు పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనేందుకు తన జీవనాధారమైన ఆవును అమ్మేశాడు. 

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ పిల్లలు ఒకరు నాలుగో తరగతి, మరోకరు రెండో తరగతి చదువుతున్నారు. అయితే తమకు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. దీంతో కుల్దీప్ కుమార్ పై స్మార్ట్ ఫోన్ కొనాలనే ఒత్తిడి పెరిగింది. ఇక ఉపాధ్యాయులు కూడా చదువు కొనసాగించాలంటే స్మార్ట్ ఫోన్ తప్సనిసరి అని సూచించారు.  దీంతో తన ఇద్దరు పిల్లల చదువు ఎక్కడ ఆగిపోతుందో అని తన జీవనాధారమై ఆవును కేవలం రూ.6వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది.

Leave a Comment