యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారదా..!

ఈ కరోనా కాలంలో చాలా ఉద్యోగాలు పోయినట్లు మనం చాలా సార్లు పేపర్లలో చదివాం..టీవీల్లో చూశాం..కానీ ఉద్యోగం కోల్పోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏమాత్రం కుంగిపోలేదు. స్వశక్తితో కుటుంబాన్ని పోషిస్తూ..కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలిచింది. కూరగాయలు అమ్ముతున్నందుకు  ఏ మాత్రం నామోషిగా లేదని అంటుంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారద. జీతం పోతే జీవితం పోయినట్లు కాదు.. లగ్జరీగా బతికితేనే లైఫ్ కాదు అంటోంది. 

ఓరుగల్లుకు చెందిన శారదా దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. ఇటీవల హైదరాబాద్ లో కొత్త జాబ్ లో జాయిన్ అయింది. మూడు నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా కష్ట కాలం మొదలైంది. లాక్ డౌన్ విధించడంతో కంపెనీ యాజమాన్యం ప్రాజెక్టులు లేవని ఉద్యోగంలో నుంచి తొలగించింది. 

ఉద్యోగం పోయిన శారద ఎలాంగి కుంగుబాటుకు గురికాలేదు. తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారికి తోడుగా కూరగాయాల వ్యాపారం ప్రారంభించింది. ఉద్యోగాలు పోయాయనే మానసిక వేదనతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి శారద ఆదర్శంగా నిలిచింది. జీతం పోతే జీవతం పోయినట్లు కాదని శారద వెల్లడించింది. ప్రతి ఒక్కరూ లగ్జరీగా బతికితేనే లైఫ్ కాదని చెప్పింది.

Leave a Comment