కాడి లాగిన అమ్మాయిలు..చలించిపోయిన సోనూసూద్..!

కష్టం వస్తే చాలు తాను ఉన్నానంటూ సాయం అందిస్తున్నాడు సోనూసూద్..కరోనా లాక్ డౌన్ లో ఎంతో మంది అభాగ్యులను ఆదుకున్నాడు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు సాయం చేశాడు. తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియో చూసి సోనూ సూద్ చలించిపోయాడు. వెంటనే ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాడు.  

రేపు ఉదయం ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్లు ట్విట్టర్ లో తెలిపాడు. మరికొద్ది సేపటికే ఎద్దులు కాదు..ట్రాక్టర్ ఇస్తానని, సోమవాయం సాయంత్రంలోపు వారి పొలంలో ఉంటుందని మరో ట్విట్ చేశాడు. ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుకోవచ్చిని పేర్కొన్నాడు. దీంతో సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. 

సేద్యం పనులకు ఆ రైతుకు కాడెద్దులు లేవు. దీంతో అతని ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా మారి కాడి లాగారు. వెనుక నుంచి తల్లిదండ్రులు విత్తనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సోనూ సూద్ తానున్నాంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. 

 

Leave a Comment