సైబర్ నేరగాళ్లకు నగ్నంగా దొరికిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్..

సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలపై రోజుకో విధంగా తన ప్రతాపాన్ని చూపుతున్నారు. పోలీసులు ఎంత జాగ్రత్తలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వల వేస్తున్నారు. ఏటీఎం పిన్ చెప్పాలని, లేదా కష్టాల్లో ఉన్నామని, లేదా ఆన్ లైన్ ఫోన్ కాల్స్ ద్వారా..ఇలా రకరకాలుగా ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సైబర్ నేరగాళ్లకు నగ్నంగా దొరికిపోయాడు..ఎలా అనుకుంటున్నారా..

ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు..అతనికి ఇంకా పెళ్లి కాలేదు..కరోనా వైరస్ ప్రభావం కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక రోజూ ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు గుర్తుతెలియని నంబర్ నుంచి అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..మీటింగ్ ఏర్పాటు చేస్తాం అంటూ మెసేజ్ వచ్చింది. ఇది నమ్మిన అతను ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. 

అవతలి వైపు ఫోన్ లో ఓ యువతి..అతను అడిగిన వాటికన్నింటికి సమాధానాలు చెప్పింది. వారి వద్ద ఉన్న డేటింగ్ ప్యాకేజీల గురించి చెప్పింది. ఆ వ్యక్తి ప్యాకేజీకి సంబంధించిన ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాడు.. తర్వాత యువతుల అశ్లీల ఫొటోలు వచ్చాయి. కొద్ది సేపటికి ఓ యువతి అతనితో చాటింగ్ కూడా చేసింది. రూ.20 వేలు పంపితే నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడతానని చెప్పింది. అప్పటికీ గ్రహించలేకపోయిన యువకుడు రూ.20 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. 

వెంటనే ఆ యువతి నగ్నంగా వీడియో కాల్ చేసింది..ఆ యువకుడు కూడా ఆమెతో నగ్నంగా మాట్లాడాడు. ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు వీరిద్దరి ఫొటోలను క్యాప్చర్ చేశారు. ఇంకేముంది ఆ యువకుడు సైబర్ నేరగాళ్లకు అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి ఆ యువకుడికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ యువకుడు రూ.50 వేలు చెల్లించాడు. ఇలా రూ.2 లక్షల వరకు సమర్పించుకున్నాడు. తర్వాత ఆ యువకుడు వారి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు ఆ యువకుడి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

 

Leave a Comment