ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ..కొన్ని అరుదైన పిక్స్ మీకోసం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు భారతదేశ జీవన విలువలు మరియు ప్రజాస్వామ్య సంప్రదాయంలో ఆదర్శాన్ని ప్రదర్శించారు. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచుతాడు. దేశం మీ అమూల్యమైన సేవలను అందుకుంటుంది. – రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 

‘ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ – రాహుల్ గాంధీ

పేదలు అట్టడుగున ఉన్న వారి సాధికారత కోసం ప్రధాని మోడీ శ్రద్ధగా పని చేశారు..ఆయన నాయకత్వం నుంచి దేశం ఎంతో ప్రయోజనం పొందింది..ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు. – రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

మోడీ తన జీవితంలో అనుక్షణం భారతదేశాన్ని బలంగా, సురక్షితంగా, స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారు. ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం నా అదృష్టం. నేడు నేను దేశ ప్రజలందరితో కలిసి ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. – హోంమంత్రి అమిత్ షా

Leave a Comment