తండ్రి శవం పక్కన సెక్సీ ఫొటో షూట్ చేసిన సోషల్ మీడియా స్టార్..!

ఇంట్లో ప్రతిరోజూ మనతో ఉంటూ.. ఓ రోజు సడెన్ గా ఆ మనిసి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం.. అదే కన్న తండ్రి చనిపోతే ఆ ఫీలింగ్స్ ని మాటల్లో చెప్పలేము.. కానీ ఓ అమ్మాయి మాత్రం తన తండ్రి చావును పబ్లిసిటీ ఈవెంట్ గా మార్చుకుంది. తండ్రి శవం పక్కన సెక్సీ పోజులతో ఫొటో షూట్ చేసింది.. ప్రస్తుతం ఈ ఫొటో షూట్ ఆమెను విమర్శలపాలు చేస్తోంది..

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన 20 ఏళ్ల జేన్ రివేరా ఓ సోషల్ మీడియా స్టార్.. ఆమె ఓ ఫిట్ నెస్ మోడల్.. మోడలింగ్, ఫ్యాషన్ దుస్తులు, స్విమ్ సూట్ ఫొటోలతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. టిక్ టాక్ లో 3 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 84 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన జీవితానికి సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది.. తాజాగా ఆమె తన తండ్రి శవం పక్కన ఫొటో షూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

జేన్ రివేరా తండ్రి ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన సోమవారం మరణించారు. దీంతో ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. కానీ తుది వీడ్కోలు సమయంలో జేన్ తన తండ్రి శవం పక్కన సెక్సీగా ఫొటో షూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ #dadless అనే హ్యాగ్ ట్యాగ్ తో రెస్ట్ ఇన్ పీస్ నాన్న, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని రాసుకొచ్చింది. 

కానీ జేన్ చేసిన పనిని మాత్రం అందరూ అసహ్యించుకుంటున్నారు. తండ్రి పక్కన ఫొటో షూట్ చేయడాన్ని ఆమె ఫాలోవర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు అసలు మనిషివేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను తిట్టిపోస్తు లక్షల మంది కామెంట్లు చేస్తున్నారు. దీంతో జేన్ రివేరా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. నాన్నంటే తనకు చాలా ఇష్టమని, మోడలింగ్ లో రాణించాలని దీవించేవారని, ఆయన లోటును ఫీలవ్వకుండా ఉండేందుకకు ఇలా ఫొటో షూట్ చేశానని జేన్ చెబుతోంది. 

 

Leave a Comment