కర్ణాటకలో కొత్త వేరియంట్ కలకలం..!

దేశంలో కరోనా మహమ్మారి కొత్తకొత్త వేరియంట్లలో రూపాంతరం చెందుతోంది. తాజాగా కొత్త వేరియంట్ ఏవై.4.2 వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో ఏడుగురు ఏవై.4.2 వేరియంట్ బారిన పడ్డారు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాధితుల్లో ముగ్గురు బెంగళూరు చెందిన వారు కాగా.. మిగితా నలుగురు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. 

ఈ వేరియంట్ గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అనుమానుతి వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ల్యాబ్ కి పంపినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ కు ఈ నమూనాలను పంపారు. ఈ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు. కాగా కొత్త కేసులతో కలిపి కర్ణాటకలో కరోనా సోకిన వారి సంఖ్య 49,19,952కు చేరింది. ఇక 29,355 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కేరళలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా  7 వేల మందికి కోవిడ్ సోకింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 482 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక తమిళనాడులోనూ కొత్తగా 1090 కేసులు వచ్చాయి. 15 మంది చనిపోయారు. ఒడిశాలో కొత్తగా 433 మంది వైరస్ బారిన పడ్డారు. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  

Leave a Comment