పాము ఉడుతల పోరాటం.. మధ్యలో పక్షి.. వీడియో వైరల్  

సాధారణంగా పాము, ముంగీసల పోరాటాన్ని అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో పాము, ముంగీసల పోరాట వీడియోలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు పాము, ఉడుతల పోరాటాన్ని చూసుండరు.. తాజాగా పాము, ఉడుతల పోరాటానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో ఓ ఉడతను పాము వెంటాడింది.. ఆ ఉడుత గోడపై పరిగెత్తుతుంటే.. దాన్ని పట్టుకోవడానికి పాము పాకుతోంది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..   

ఉడుత గోడపై పరిగెత్తుతూనే.. తనవైపు వస్తున్న పాముతో పోరాడటానికి ప్రయత్నించింది. అలా రెండు మూడు సార్లు ఆ పాముపై దాడి చేయాలని ప్రయత్నం చేసింది.. పాము కూడా ఏమాత్రం భయపడకుండా ఉడుతవైపు పాకుతూ వచ్చింది.. ఇంతలో ఓ పక్షి నేనున్నా అంటూ అక్కడికి వచ్చి  ఉడుత ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది. ఆ పాముపై పక్షి దాడి చేసింది. దీంతో ఆ పాము గోడపై నుంచి కిందపడిపోతుంది. ఈ పోరాటాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో   ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.. 

 

 

 

 

Leave a Comment