అమ్మాయికి ముద్దులు పెట్టి ప్రపోజ్ చేసిన చింపాంజీ.. వీడియో వైరల్..!

అప్పుడప్పుడు కోతులు, చింపాజీలు మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. ఎందుకంటే మనుషులకు, చింపాజీలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.. అవి చేసే చేష్టలు మనుషుల్లాగే ఉంటాయి. కోతులు, చింపాజీల ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఓ చింపాంజీ చింపాంజీ ఓ అమ్మాయికి ముద్దులు పెట్టి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ సఫారీలో ఓ చింపాంజీ ప్రత్యేకంగా కనిపించింది. ప్యాంట్ వేసుకొని అక్కడి తిరుగుతోంది.. అక్కడ ఫొటో షూట్ కోసం వచ్చిన ఓ అమ్మాయి.. చింపాంజీతో కలిసి ఊయల ఊగుతూ ఉంటుంది.. ఆ సమయంలో ఆమె భుజంపై చేయి వేసి హగ్ చేసుకుంటుంది.. ఆ తర్వాత, ముఖంపై ముద్దులు పెట్టింది. చేతికి ముద్దులు పెడుతూ ప్రపోజ్ చేసినట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. సౌమియా చంద్రశేఖరన్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఇటీవల బ్యాంకాక్ లో సఫారీ వరల్డ్ ని సందర్శించినప్పుడు అక్కడ చింపాంజీతో ఫొటో షూల్ చేశారు. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. 

 

View this post on Instagram

 

A post shared by ℂ (@sowmiya_chandrasekaran)

Leave a Comment