వామ్మో..పురుషాంగంపై పాము కాటు..!

పామును చూస్తేనే సగం ప్రాణం పైకొస్తది. అలాంటిది పాటు కాటేస్తే..అది కూడా పురుషాంగంపై కాటేస్తే.. ఇక ఆ బాధ భరించలేనిది. ఇలాంటి ఘటన బ్యాంకాక్ లో జరిగింది. బ్యాంకాక్ లో నివాసం ఉండే సిరపోప్ మసుకారత్(18) అనే యువకుడు తన ఇంట్లోని టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అప్పటికే ఓ పాము కమోడ్ లో దాగి ఉంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆ పాము యువకుడి పురుషాంగంపై కాటు వేసింది. 

దీంతో ఆ యువకుడు నొప్పిని భరించలేకపోయాడు. అతని పురుషాంగం కూడా వాచిపోయింది. ఇక ఆ యువకుడు తన పురుషాంగాన్ని చేతిలోనే పట్టుకుని వెళ్లి తన సోదరుడికి విషయం చెప్పాడు. వెంటనే కారు తీసి అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్చించారు. వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ యువకుడిని కాటేసింది విషపు నాగు కాదని, బురద జాతి పామని వైద్యులు గుర్తించారు. ఆ పాము విషం ప్రమాదకరమైనది కాదని, అతని పురుషాంగానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదని వైద్యులు తెలిపారు. 

Leave a Comment