ఇండియన్ ఆర్మీపై అసత్య ప్రచారం.. మరీ ఇంత నీచమా?

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొట్టింది..భారత్ – చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో 80,000 మంది భారత సైనికులు సిక్ లీవ్ పై వెళ్తున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. చైనా సైన్యంతో పోరాడలేక లీవ్ కోసం అప్లయి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తమ అధికారిక ట్విట్టర్ లో ఖండించింది. 

సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఇందులో నిజం లేదని, మన సైనికులు సెలవులకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా స్పష్టం చేశాయి.. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అసత్య ప్రచారం చేసిన వారిపై అధికారులు విచారణ చేపట్టారు. 

Leave a Comment