మాస్క్ లేకుండా వైసీపీ ఎమ్మెల్యే డ్యాన్స్..!

కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరి అని నిబంధనలు ఉన్నాయి. అయితే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం కనీసం మాస్క్, భౌతిక దూరం లేకుండా డ్యాన్స్ చేశారు. వైఎస్ ఆర్ వారోత్సవాల సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరగా మారింది. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. 

టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే తీరుపై మండిపడుతూ ట్వీట్ చేశారు. ‘మాస్కుల్లేవు, భౌతిక దూరం లేదు..రాష్ట్రంలో ఇప్పటికీ 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మాత్రం సిగ్గు లేకుండా సూపర్ స్ప్రెడర్ గా మారారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్ రెడ్డికి గతంలో కరోనా పాటిజివ్ వచ్చింది. ఇప్పటికీ అతను దీని నుంచి పాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో కూడా ఆయన లాక్ డౌన్ సమయంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి విమర్శల పాలయ్యారు. 

 

Leave a Comment