ఈ చిన్నారి టెలెంట్ కి ఫిదా అయిన కేటీఆర్.. వీడియో వైరల్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. స్ఫూర్తివంతమైన, ఆసక్తికరమైన విషయాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి టాలెంట్ కి ఫిదా అయిన కేటీఆర్ ఆమెకు స్పెషల్ విషెస్ చెబుతూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. 

‘ది బెటర్ ఇండియా’ అనే ట్విట్టర్ హాండిల్ ఓ వీడియోని ట్వీట్ చేసింది. అందులో మెహక్ ఫాతిమా అనే ఆరేళ్ల చిన్నారి ప్రస్తావించింది. కోజికడ్ కి చెందిన ఈ చిన్నారికి మూడేళ్ల తమ్ముడు ఉన్నాడు. అతడికి వాళ్ల తండ్రి క్రికెట్ నేర్పిస్తున్నాడు. అమ్మాయి కదా అని ఆమె నేర్పించలేదు. దీంతో చిన్నారి తన తండ్రిని నిలదీసింది. తాను అమ్మాయిని కాబట్టి నేర్పించడం లేదా నాన్నా అంటూ ప్రశ్నించింది. 

దీంతో ఆమె తండ్రి ఫాతిమాకు కూడా క్రికెట్ పాఠాలు నేర్పించాడు. అంతే ఆ చిన్నారి బ్యాట్ తో ఇరగదీస్తోంది. మంచి ఫుట్ వర్క, పూర్తి బ్యాలెన్స్ తో బంతిని ఆడుతోంది. కవర్ డ్రైవ్ లు, స్ట్రయిట్ షాట్లు, ఫ్లిక్, డిఫెన్స్, పుల్ షాట్ ఇలా క్రికెట్ బుక్ లో ఉన్న షాట్లన్నీ ఆడేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేటీఆర్ వరకు చేరడంతో.. ఆమె టెక్నిక్ కి కేటీఆర్ ఫిదా అయ్యారు. దీంతో ఫాతిమా టెలెంట్ ఇప్పుడు ట్విట్టర్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.  

Leave a Comment