ఇష్టమొచ్చినట్లు తాకుతూ.. అక్కతో తమ్ముడి వికృత చేష్టలు.. సమర్థించిన తల్లిదండ్రులు..

తెలుగు ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్మయి సింగర్ గానే కాదు.. సమాజంలోని మహిళల సమస్యలపై పోరాటం చేస్తోంది.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నస్తుంటుంది. ఇక మహిళలు కూడా తమ జీవితాల్లోని జరిగే సంఘటలను చిన్మయితో చెప్పుకుంటుంటారు. 

తాజాగా ఓ అమ్మాయి తనకు జరిగిన చేదు ఘటన గురించి చిన్మయితో పంచుకుంది.  తనకు 19 ఏళ్లు ఉన్నాయని, పదహారేళ్ల వయసున్న తన తమ్ముడు.. తనను ఇష్టమొచ్చిన చోట.. ఇష్టమొచ్చినట్టుగా తాకేవాడని చెప్పింది. ఇదే విషయాన్ని తాను పేరెంట్స్‌కి చెబితే.. వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని.. యవ్వనంలోకి వస్తున్నాడని.. అందుకే కంట్రోల్ చేసుకోలేకపోతోన్నాడని.. నువ్వే సరిగ్గా నీ శరీరాన్ని దాచుకోవడం లేదని అన్నారని తెలిపింది. అది నీ తప్పే అయి ఉంటుందని అన్నారని, తల్లిదండ్రులే అలా అనడంతో ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకున్నాని,  కానీ తనకు కేవలం 19 ఏళ్లే ఉన్నాయని, అందేకే ఆగిపోయానని ఆ అమ్మాయి తన బాధను బయటపెట్టింది. .

ఆ అమ్మాయి చెప్పిన విషయాలు విన్న తరువాత తల్లిదండ్రుల మీద చిన్మయి మండిపడింది. మీకు అమ్మాయిలు అంటే ఎందుకంత ద్వేషం అంటూ సూటిగా ప్రశ్నించింది. మొత్తానికి చిన్మయికి మాత్రం ఇలాంటివి రోజుకు వందల కొద్దీ మెసెజ్‌లు వస్తుంటాయి. అందరూ చిన్మయికే తమ బాధలను చెప్పుకుంటారు. నీ వల్లే ఈ రోజుకైనా మేం వీటిని ధైర్యంగా బయటపెడుతున్నాం.. వీటి గురించి మాట్లాడగలుగుతున్నాం.. మీరే మాకు స్పూర్తి అంటూ చిన్మయి మీద ప్రశంసలు కురిపిస్తుంటారు.

 

Leave a Comment