ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది. అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మన దేశాలోనూ మంకీపాక్స్ వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కన్పించాయి. ఘజియాబాద్ కి చెందిన ఓ ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి.
శరీరంపై దద్దర్లు, బొబ్బలు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ చిన్నారి నమూనాలను సేకరించి పూణేలోని ల్యాబ్ కి టెస్ట్ కోసం పంపించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చిన్నారికి ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వెల్లడించారు.