ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉతీర్ణత సాధించారు.

ఈ పరీక్ష ఫలితాల్లో  బాలికలే పైచేయి సాధించారు. 78.3 శాతంలో ప్రకాశం జిల్లా మొదటిస్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు టెన్త్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ సారి ర్యాంకులకు బదులు మార్కులను ప్రకటించారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించింది. 

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment