మీరు బ్రాయిలర్ కోడి తింటున్నారా..? అయితే షాకింగ్ నిజాలు తెలుసుకోండి…!

ఆదివారం వస్తే చాలా మందికి గుర్తొచ్చేది కోడి కూర. కోడి కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో వివిధ రకాల కూరలు, వంటకాలను రుచికరంగా వండుకుని తింటుంటారు. ఇక పొట్టేలి మాంసంతో పోలిస్తే చికెన్ ధర తక్కువ కూడా ఉంటుంది. వివిధ ఫాస్ట్ ఫుడ్ల తయారీలో చికెన్ ప్రధానంగా మారింది. 

చికెన్ ను ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్రాయిలర్ కోళ్లను తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రాయిలర్ కోడిని తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకుందాం..

బ్రాయిలర్ కోడి తినడం ద్వారా కలిగే దుష్ప్రభావాలు..

  • ఒక అధ్యయనం ప్రకారం బ్రాయిలర్ చికెన్ ను అధిక ఉష్ణోగ్రత వద్ద వండి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. 
  • పౌల్ట్రీ ఫామ్ లలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పౌల్ట్రీలలో పెంచే బ్రాయిలర్ చికెన్ లో ఉండే బ్యాక్టీరియా అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. 
  • కాల్చిన బ్రాయిలర్ చికెన్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇక బ్రాయిలర్ చికెన్ లెగ్ పీస్ తింటే 60 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో.. అంత ప్రమాదమట..చికెన్ ను ఎక్కువ వేడి చేయడం వల్ల ప్రోటీన్లు తగ్గిపోతాయి.   
  • బ్రాయిలర్ చికెన్ లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు త్వరగా బరువు పెరగడానికి ఇది కారణమవుతుంది. 
  • ఫామ్ లలో పెంచే కోళ్లకు త్వరగా పెరగడానికి వాటికి కొన్ని రకాల సిరంజీలను ఎక్కిస్తారు. దీని వల్ల మహిళల సంతానోత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. 
  • క్రమం తప్పకుండా బ్రాయిలర్ చికెన్ తినే పురుషుల్లో శుక్రకణాల సామర్థ్యం తగ్గడంతో పాటు సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 

Leave a Comment