మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్..!

ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్ లో ముంబై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా, సింగర్ గురు రాంధవాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వెంటనే వారిని బెయిల్ పై విడుదల చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. 

ఈ దాడిలో ముంబై క్లబ్ కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సురేష్ రైనా మరియు గురు రాంధవా సహా 34 మందిపై సెక్షన్ 188, 269 కింద కేసులు నమోదు చేశారు. రాత్రి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం క్లబ్ ను తెరిచి ఉంచడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో డ్రాగన్ పబ్ పై రైడ్ నిర్వహించారు. 

Leave a Comment