కోళ్లకు  బర్త్ డే పార్టీ..కేక్ కటింగ్ కూడా..!

చాలా మందికి కోళ్ల పట్ల ఎంతగానో ప్రేమ ఉంటుంది. వాటి కోసం ఏదైనా చేస్తారు. తాజాగా బెళగావికి చెందిన ఓ ఫ్యామిలీ రెండు కోడి పుంజులకు బర్త్ డే నిర్వహించింది. వాటి కోసం బర్త్ డే పార్టీ కూడా ఏర్పాటు చేసింది. వాటితో కేక్ కూడా కట్ చేయించింది. బ్యానర్లు, లైటింగ్ తో వేడుక చేసింది.  

బెళగావికి చెందిన లంగర్ కండే కుటుంబం ఈ వేడుకలను నిర్వహించింది. ఐదేళ్ల క్రితం ఈ కుటుంబం మార్కెట్ నుంచి ఏడు కోడి పిల్లలను తెచ్చుకున్నారు. ఆరు నెలల్లోనే వాటిలో ఐదు చనిపోయాయి. ఈ రెండు కోళ్లు మాత్రం ఆరోగ్యంగా పెరిగాయి. అప్పటి నుంచి వాటిని అపురూపంగా పెంచుకుంటున్నారు. 

వాటికి వీరు, షేరూ అని పేర్లు కూడా పెట్టారు. ఈ కోళ్లు వచ్చినప్పటి నుంచి తమ కుటుంబ వ్యాపారంలో కలిసి వచ్చిందని, ఇవి తమ కుటుంబంలో భాగమని ఆ కుటుంబ సభ్యుడు మేఘన్ తెలిపారు. అందుకే ఈ కోళ్ల పుట్టిన రోజును వేడుకలా నిర్వహిస్తామన్నారు. ఉదయాన్నే ఈ కోడి పుంజులకు బిస్కట్లు, ధాన్యం తినిపిస్తామని ఈ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

 

Leave a Comment