రోజాకు షాక్.. కీలక పదవి నుంచి తప్పించిన జగన్ సర్కార్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆమెను ఏఐసీసీ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మెట్టు గోదర్థన్ రెడ్డిని నియమిస్తూ ప్రకటించింది. దీంతో రోజాకు ఎమ్మెల్యే అన్న హోదా తప్ప.. వేరే పదవి లేకుండా పోయింది.  

తొలి కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తారని రోజా ఆశించారు. అప్పటి సామాజిక సమీకరణాలు.. జిల్లాల్లో రాజకీయ పరిస్థితులతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఆమెను బుజ్జగించేందుకు ఏఐసీసీ చైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు.  ఇప్పుడు నామినేటెడ్ పోస్టు కూడా దూరం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలసీలో భాగంగా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టుల నుంచి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో రోజాను ఏఐసీసీ పదవి నుంచి తప్పించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రోజాతో పాటు ఎమ్మెల్యే జక్కం పూడి రాజాకు సైతం షాక్ తగిలింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆయను తప్పించారు. అలాగే మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కూడా షాక్ ఇచ్చారు.  

 

Leave a Comment