ఏ బ్లడ్ గ్రూపు వారికి కరోనా ఫాస్ట్ గా వస్తుందో తెలుసా? 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా కట్డడి చర్యలతో కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు తొలగించాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కరోనా నిబంధనలు సరిగ్గా పాటించడం లేదు. దీంతో కొద్ది రోజులుగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. 

ఇక కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపించింది. థర్డ్ వేవ్ ఇంకా వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మహారాష్ట్రలో థర్డ్ వేవ్ మొదలైందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కరోనా ఒక్కక్కరిలో ఒక్కో రకంగా ప్రభావం చూపుతోంది. కొంత మందిలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుండగా, మరికొందరిలో ఎలాంటి ప్రభావం చూపడం లేదు. 

కరోనా వైరస్ ఏ బ్లడ్ గ్రూపు వారికి ఎక్కువ సోకుతుందన్న విషయంపై ఇటీవల సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ విభాగానికి చెందిన వైద్యులు అధ్యయనం చేశారు. గతేడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో ఆస్పత్రికి వచ్చిన 200 మంది బాధితులపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీని కోసం 19 నుంచి 85 ఏళ్ల వయస్సు కలిగిన బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. 

రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’ బ్లడ్ గ్రూపు వారిలోనే కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఓ’ బ్లడ్ గ్రప్ వారికి కూడా కరోనా సోకుతున్నట్లు నిర్ధారించారు. ఇక అత్యల్పంగా ‘ఏబీ’ పాజిటివ్ గ్రూపు వారికి సోకినట్లు గుర్తించారు. ఈ మేరకు రూపొందించిన అధ్యయనాన్ని ప్రచురణ నిమిత్తం ఈ ఏడాది జులై 14న అంతర్జాతీయ జర్నల్ కు పంపించినట్లు వైద్యులు తెలిపారు.  

 

Leave a Comment