నామినేటెడ్ పదవుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ‘శాప్’..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టుల్లో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని నియమించింది.  బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ యువ నాయకుల్లో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.. కర్నూలు జిల్లాలో యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజవర్గంలో వైసీపీ గెలుపునకు కీలక పాత్ర పోషించారు. 

గత ఎన్నికల సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మంచి ప్రాధాన్యత పోస్ట్ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే నామినేటెడ్ పోస్టుల్లో కీలక పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్(శాప్) పదవిని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కట్టబెట్టారు. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Leave a Comment