గ్యాస్ వినియోగదారులకు షాక్..పెరిగిన గ్యాస్ ధరలు 

గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. జూన్ 1 నుంచి వంట గ్యాస్ ధరలను పెంచాయి. లాక్ డౌన్ అన్ లాక్ 1.0 యొక్క మొదటి రోజే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగాయి. దీంతో వినియోగదారులపై ప్రభావం పడనుంది. పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 

పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి పెరిగింది.

అయితే మే నెలలో అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడంతో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గింది. అయితే జూన్ నెల వచ్చేసరికి అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు పెరిగాయి. అందువల్ల గ్యాస్ ధరలు పెంచాల్సి వచ్చినట్లు గ్యాస్ కంపెనీలు తెలిపాయి. కాగా ఈ పెంపు ఉజ్వల యోజన లబ్ధిదారులపై ఉండదని,  వారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద జూన్ 30 వరకు ఉచిత సిలిండర్ పొందవచ్చని కంపెనీలు పేర్కొన్నాయి. 

Leave a Comment