చికెన్ నుంచి కరోనా కంటే ప్రమాదకర వైరస్..శాస్త్రవేత్త హెచ్చరిక

ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ తో పోరాడుతోంది. అయితే కరోనా కంటే కోళ్ల నుంచి వచ్చే వైరస్ మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన శాస్ట్రవేత్త మైఖేల్ గ్రెగర్. దీని కారణంగా జనాభాలో సగం మందిని కోల్పోతామని చెప్పారు. 

ఇటీవల ఆయన అంటువాధ్యులను ఎలా నివారించాలి అనే దానిపై ‘హౌ నాట్ టు డై’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇది అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో చోటుసంపాదించుకుంది. మైఖేల్ గ్రెగర్ తెలిపిన దాని ప్రకారం..చికెన్ కరోనా కంటే తీవ్రమైన మహమ్మారికి కారణం కావచ్చని హెచ్చరించారు. కోళ్ల క్షేత్రాల నుంచి వచ్చే అపోకలిప్టిక్ వైరస్ కోవిడ్-19 కంటే ప్రమాాదకరమన్నారు. 

డాక్టర్ గ్రెగర్ ‘హౌ టు సర్వైవ్ ఎ పాండమిక్’ అనే పుస్తకంలో పౌల్ట్రీ ఉన్నంత వరకు మహమ్మారి ఉంటుందని హెచ్చరించారు. అందులో ఆయన శాఖాహారం ప్రయోజనాలను వివరించారు. జంతువుల నుంచి మానవులకు వ్యాపించే చాలా వైరస్ లు ఎటువంటి హానీ కలిగించవు. కానీ క్షయ, సార్స్ వంటి కొన్ని రకాల వైరస్ లు మాత్రం చాలా వేగంగా పెరుగుతాయన్నారు. నిజానికి అవి చాలా ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించారు. 

ప్రస్తుతం ప్రపంచంలో కోళ్ల పెంపకం బాగా పెరిగిపోయింది. కోడి గుడ్లను కూడా ఎక్కువగా తింటున్నారు. ఇక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కోళ్లను చాలా క్రూరంగా బోనులో ఉంచుతారు. వాటికి రసాయనాలు కలిపిన ఆహారాన్ని ఇస్తారు. ఈ కారణంగా చికెన్ లో వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మైఖేల్ గ్రెగర్ అభిప్రాయపడ్డారు. 

1997 లో హాంకాంగ్ లో వెలువడిన H5NI బర్డ్ ఫ్లూ వైరస్ భయంకరమైన వినాశాన్ని కలిగించిందన్నారు. దీంతో మిలియన్ల కోళ్లను చంపాల్సి వచ్చందన్నారు. 2003 మరియు 2009 మధ్య చైనాలో మళ్లీ దీని వ్యాప్తి జరిగిందని, ఈ వైరస్ పూర్తిగా తొలగించబడలేదని అన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ మళ్లీ వ్యాప్తి చెందే అవకాశం ఉందని డాక్టర్ గ్రెగర్ సూచించారు. 

Leave a Comment