సీఏఏకు శివసేన మద్దతు

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సీఏఏకు మద్దతు తెలిపారు. సీఏఏతో దేశంలో ఏ ఒక్కరికీ నష్టం జరగదని, ఎన్పీఆర్ ను మహారాష్ట్రలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం హోదాలో తొలిసారిగా హస్తినలో పర్యటించిన ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ప్రధాని మోడీతో శుక్రవారం భేటీ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA), ఎన్ ఆర్సీ, ఎన్పీఆర్ లపై చర్చలు జరిపారు. 

సీఏఏ వల్ల మహారాష్ట్రలో ఏ ఒక్కరికీ ఇబ్బంది ఉండదన్నారు. సీఏఏ గురించి దేశంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్పీఆర్ వల్ల దేశం నుంచి బయటికి గెంటివేయబడరని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ లతో ఏర్పాటైన ‘మహా అఘాడీ’ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలనను పూర్తి చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మహారాష్ట్ర ప్రబుత్వానికి సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారని ఉద్దవ్ తెలిపారు. 

Leave a Comment