ఓలా, ఊబర్ లతో పేటీఎం బ్యాంక్ భాగస్వామ్యం

లక్షకు పైగా డ్రైవర్లు ఫాస్టాగ్స్ వినియోగానికి వెసులుబాటు

వాహన రవాణా సదుపాయాల కంపెనీలు ఓలా, ఊబర్ లతో వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీ) శుక్రవారం వెల్లడించింది. ఈ ఒప్పందంతో దాదాపు లక్ష మందికి పైగా డ్రైవర్ల భాగస్వామ్యం పేటీఎం ఫాస్టాగ్స్ ను సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి వీలుకలుగుతుందని, తద్వారా దేశ వ్యాప్తంగా ప్రయాణ సదుపాయాలు మెరుగవుతాయని పీపీబీ ప్రకటించింది. ఊబర్ గ్రీన్ జోన్ లోని వివిద నగరాల్లో పీపీబీ 12 శిబిరాలను ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా డ్రైవర్లు ఫాస్టాగ్స్ కొనుగోలు, వినియోగం సులభతరం అవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే ఓలాతో బెంగళూరు విమానాశ్రయంతో బాటు ఇతర లొకేషన్స్ లో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇందులో బెంగళూరు నగరంలోని ఇందిరా నగర్, దేవనహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ రవాణా హబ్స్ ఉన్నాయని దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులను అనుసరించేందుకు క్రుషి చేస్తున్నట్లు పీపీబీ వివరించింది. పేటీఎం ఫాస్టాగ్ కోసం ఎలాంటి ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ఖాతాలను తెరవాల్సిన అవసరం లేదని తెలిపింది. పేటీఎం వాలెట్ల నుంచి ఆటోడెబిట్ విధానం ద్వారా టోల్ పేమెంట్స్ జరుగుతాయని, మిగిలిన సొమ్ముతో షాపింగ్, రీచార్జిలు, బిల్ పేమెంట్లకు, ఇతర సేవలకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. 

Leave a Comment