టాలీవుడ్ లో విషాదం..కరోనాతో శిశ శంకర్ మాస్టర్ మృతి..!

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారి చనిపోయారు. ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. 

శివ శంకర్ మాస్టర్ 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. 1975లో పాట్టు భరతమమ్ అనే సినిమాకు ఆయన అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ గా పని చేసి సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించారు.  ఆయన తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు భాషల్లో 800లకు పైగా సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. సుమారు 30 సినిమాల్లో ఆయన నటించారు.   

  

Leave a Comment