శివాలయలంలో అద్భుతం.. బావిలో వేడి నీళ్లు.. దేవుడి మహిమే అంటున్న గ్రామస్తులు..!

మహబూబాబాద్ జిల్లా కేస సముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంంలో అద్భుతం చోటుచేసుకుంది. పురాతన శివాలయంలోని చేదబావిలో నీళ్లు వేడక్కెతున్నాయి. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది శివుని మహిమ అంటూ పూజలు చేస్తున్నారు. 

గ్రామంలో శివాలయం, ఆలయ ఆవరణలో చేద బావిని కాకతీయుల కాలంలో రాతి కట్టడంతో నిర్మించారు. ఈ ఆలయంలో పనిచేసే గ్రామస్తురాలు సుగుణ తొలిత బావిలో నీళ్లు వేడిగా ఉండటాన్ని గమనించింది. ఆ నీటిని ఆలయ ఆవరణలో పోసి చూడగా పొగలు వచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమె విషయాన్ని ఆలయ పూజారికి చెప్పింది. బావిలో నీరు వేడెక్కినట్లు గుర్తించిన ఆయన గ్రామస్తులకు చెప్పారు.

గ్రామస్తులు కూడా వచ్చి నీళ్లని చూసి ఆశ్చర్యపోయారు. బావిలో నీరు పట్టుకుంటే చేతులు కాలిపోయంత వేడిగా ఉండటంతో వారు షాక్ అయ్యారు. దీంతో ఇదంతా దేవుడి మహిమ అంటూ ఆదివారం ఆలయానికి చేరుకుని బావి వద్ద పూజలు చేశారు. ఈ శివాలయాన్ని పునర్మించాలని గతంలో గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకొని పట్టించుకోకపోవడంతో ఈ వింత సంఘటన జరిగినట్లు భక్తులు వాపోయారు. ఎందుకు ఇలా జరిగిందో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

 

Leave a Comment