ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఏంటీ.. ఎవరికీ ఈ వైరస్ సోకుతుందంటే..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఈనెల 24న వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ కేవలం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు వ్యాపించింది. దీంతో ఎక్కడిక్కడ దేశాలు మరోసారి ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ యూరస్ సహా వివిధ దేశాల్లో విస్తరించింది.  

ఈ కొత్త వేరియంట్ లో కొన్ని లక్షణాలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చీఫ్ చెప్పిన దాని ప్రకారం గత 10 రోజుల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన 30 మంది రోగులను పరిశీలించారు. వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో వైద్యులు వివరించారు. 

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు :

  • అలసట ఎక్కువగా ఉండటం
  • గొంతులో ఇబ్బంది
  • శరీరంలో కొద్ది పాటి కండరాల నొప్పి
  • పొడి దగ్గు
  • కొంత మందిలో జ్వరం

ఈ వేరియంట్ లక్షణాలు డెల్టా వేరియంట్ లక్షణాలకు భిన్నంగా ఉన్నాయి. అయితే ఇది మునుపటి వేరయింట్ల కంటే ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చీఫ్ డాక్టర్ ఎంజెలికో కోఎన్జీ తెలిపారు. అయితే ఇప్పటి వరకు తాను చూసిన ఒమిక్రాన్ కేసుల్లో ఎవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అందరిలో ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపనారు. యూరప్ లో ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా 40 సంవత్సరాల వయసు ఉన్న వారు ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇంత వరకు ఈ వేరియంట్ సోకలేదు. అయితే ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమో తెలియాంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..

Leave a Comment