విచిత్రం : ప్రెగ్నెంట్ అని తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది..

ఒక మహిళ గర్హవతి అయితే అబ్బా..ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం..మొదటి నెల నుంచి ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం జాగ్రత్తలు పాటిస్తాం..కానీ బ్రిటన్ లోని లిటిల్ హాంప్టన్ పరిధిలోని వెస్ట్ సస్సెక్స్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తను గర్భవతి అని తెలియకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 

గ్రేస్ మీకిమ్ (32) అనే మహిళ గర్భవతి అయింది. అలా 37 వారాలు దాటిపోయాయి. కానీ ఆ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం. ఓ రోజు ఆమె బాత్రూమ్ కు వెళ్లింది. అంతలోనే ఆమెకు కడుపునొప్పి వచ్చింది. నొప్పులు ఎక్కువ కావడంతో గట్టిగా అరిచింది. దీంతో ఆమె భర్త జేమ్స్, కొడుకు టైలర్ బాత్రూమ్ వద్ద వచ్చారు. 

అక్కడకు వచ్చిన వారు షాక్ కు గురయ్యారు. ఆ మహిళ బాత్రూమ్ లో ప్రసవం అయింది. షాక్ నుంచి తేరుకున్న వారు తల్లీబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే గతంలో ఆమెకు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే మూడు సార్లు గర్భనిర్ధారణ పరీక్షలు చేయించింది. కాగా, మూడు సార్లు కూడా నెగెటివ్ అని వచ్చాయి. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై గ్రేస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

Leave a Comment