బోర్డర్ల వద్ద ‘ఆర్ఆర్ఎస్’ను పంపాలి : కాంగ్రెస్ నేత 

గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ దేశంలో రాజకీయ దుమారం రేపింది.  ప్రధాని మోడీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైనికులకు ఆయుధాలు లేకుండా బోర్డర్ కు ఎందుకు పంపారని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా ప్రతిపక్షాలకు దీటుగా సమాధానాలు ఇస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో మరో కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఎస్ సేనను సరిహద్దుకు పంపండి..వారు కాపలాగా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘సైనికులను ఆయుధాలు లేకుండా కర్రలతో పంపారు..కర్రలు పట్టుకునేది ఆర్ఆర్ఎస్ శాఖ పని’ అని చెప్పారు. 

శుక్రవారం జాతీయ మీడియా ANIతో ఆయన మాట్లాడారు. సరిహద్దులో మన దేశ 20 మంది జవాన్లు మరణించడం బాధాకరం. వారిని ఆయుధాలు లేకుండా ఎలా పంపారు అంటు మండిపడ్డారు. చైనా సైనికులు ఎవరూ చనిపోలేదని, తమ జవాన్లు మాత్రమే మరణించారని ఆరోపించారు. 

 

Leave a Comment