మామను క్లీన్ బౌల్డ్ చేసిన షాహిన్ ఆఫ్రిది..!

పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కూతురికి పెళ్లి నిశ్చయమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఆఫ్రిది పెద్ద కూతురు అక్సాను షాహిన్ ఆఫ్రిదికి ఇచ్చి పెళ్లి చేయాలని షాహిన్ తండ్రి అయాజ్ ఖాన్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చారని, అందుకు షాహిద్ ఫ్యామిలీ అంగీకరించిందని పలు కథనాలు వచ్చాయి. అయితే పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నట్లు షాహిద్ ఆఫ్రిది కూడా తెలిపాడు. 

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా షాహిన్ ఆఫ్రిది ప్రత్యర్థి జట్టులో షాహిద్ ఆఫ్రిదిని క్లీన్ బౌల్డ్ చేశాడు. తాజాగా ఈ వీడియోకు ‘సునో ససుర్ జీ అబ్ జిద్ ఛోడో’ అనే హిందీ పాటను జోడించి వైరల్ చేస్తున్నారు. ‘మామ గారు ఇప్పటికైనా పట్టు వీడండి’ అని దాని అర్థం..  

Leave a Comment