ఇండియాలో వ్యాక్సిన్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా..!

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.  భారత్ ప్రభుత్వం కూడా కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల ప్రకటించింది. ఈక్రమంలో ఇండియాలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. 

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అనుమతి కోసం సీరం ఇన్ స్టిట్యూట్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనతో ఉంది. ఇదే వ్యాక్సిన్ ను యూకే రెగ్యులేటరీ పరిశీలిస్తోంది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి యూకే, బ్రెజిల్ దేశాల్లో జరుగుతున్న ట్రయల్స్ ఆధారంగా అనుమతి ఉంటుంది. 

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ను దేశీయంగా ఉత్పత్తి చేసి పంపిణీ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకన్న సీరం ఇన్ స్టిట్యూట్ ఇండియాలో ఆమోదం కోసం భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. యూకే డ్రగ్స్ రెగ్యులేటరీ ఆమోదం లభించిన వెంటనే ఇండియాలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ నాటికి ఇండియాలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తికి సీరమ్ ఇన్ స్టిట్యూట్ అనుమతి లభించవచ్చు. 

యూకే, బ్రెజిల్ దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ మరియు ఆమోదం అంశాలను భారత్ ప్రాతిపాదికగా తీసుకుంటోంది. ఈ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్థ్యాన్ని, మోతాదును మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(MHRA) అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ 2,3 దశల క్లినికల్ ట్రయల్స్ డేటాతో పాటు యూకే ట్రయల్ ఇమ్యునోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరం ఇన్ స్టిట్యూట్ ను ప్రభుత్వం కోరంది. భారత్ లో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే MHRA కు వివరాలు తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వ ప్యానెల్ కమిటీ కోరింది. 

Leave a Comment