మీర్జాపూర్-2 ఇప్పుడు తెలుగులో..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో క్రైమ్ జోనర్ కథలకు మంచి ఆదరణ వస్తోంది. అలాంటి క్రైమ్ స్టోరీతో వచ్చిన మీర్జాపూర్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. అయితే ఇటీవల ఈ సిరీస్ కు సీక్వెల్ గా మీర్జాపూర్-2 వచ్చింది. అక్టోబర్ 23న అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ విడుదలైంది.  

అయితే మీర్జాపూర్ సిరీస్ ను తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేశారు. కానీ మీర్జాపూర్-2 మాత్రం కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. దీంతో తెలుగు ప్రేక్షకులు పూర్తిగా నిరాశ చెందారు. అంతే కాదు మీర్జాపూర్ -2ను తెలుగులో కూడా విడుదల చేయాలని అభిమానులు పట్టుబట్టారు. 

సోషల్ మీడియాలో అయితే మీర్జాపూర్-2 తెలుగు వెర్షన్ కోరుతూ రచ్చరచ్చ జరిగింది. ఈనేపథ్యంలో మీర్జాపూర్-2 ను తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. డిసెంబర్ 11న అంటే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోను అందుబాటులోకి తెచ్చింది. మీర్జాపూర్ -2 ప్రస్తుతం తెలుగులోనూ లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Leave a Comment