కరోనాతో ప్రముఖ జర్నలిస్టు మృతి..

కరోనాతో ఆజ్ తక్ న్యూస్ చానెల్ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గురువారం మెట్రో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో సర్దానా మరణించారు. సర్దానా మరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.  

సర్దానా మృతిపై ప్రధాని సంతాపం తెలిపారు. ‘రోహిత్ సర్దానా మనల్ని విడిచి పెట్టి వెళ్లడం బాధాకరం. అయన ఎప్పుడూ దేశ ప్రగతి కోసం ఆలోచించేవారు. ఆయన అకాల మరణం మీడియా ప్రపంచంలో పెద్ద శూన్యతను మిగిల్చింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం. ఓంశాంతి’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, ఢిల్లి ఉపముఖ్యమంత్రి మనీష సిసోడియా, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా రోహిత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.  

Leave a Comment