మంచి మార్కులు లేకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏంటీ? : సీఎం జగన్

విద్యార్థుల భవిష్యత్ కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. నిన్న కేరళలో టెన్త్ పరీక్షలు పూర్తి చేశారని సీఎం జగన్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలల నిర్వహణపై కేంద్రం ఎలాంటి విధానాలు ప్రకటించలేదన్నారు. పరీక్షల నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్రానికే వదిలేసిందని చెప్పారు. 

కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయని పేర్కొన్నారు. పరీక్షలు పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులే ఇస్తున్నాయని, అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని వెల్లడించారు. మంచి మార్కులు లేకపోతే మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని, పాస్ మార్కులతో బయటపడ్డ విద్యార్థుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

 

Leave a Comment