హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం..!

Home Isolation New Guidelines : కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా బారిన పడిన వారిలో లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ స్వల్ప మార్పుతో కొత్త గైడ్ లైన్స్ ప్రకటించింద. 

కొత్త మార్గదర్శకాలు ఇవే..

  • హోం ఐసోలేషన్ లో ఉండి లక్షనాలు లేని వారు లేదా స్వల్ప లక్షనాలు ఉన్న వారు రెమ్ డెసివిర్ ఔషధాన్ని తీసుకోవద్దు. ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగులు మాత్రమే దీన్ని తీసుకోవాలి. 
  • నోటి ద్వారా ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోకూడదు. ఏడు రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం, దగ్గు ఉంటే వైద్యుల సూచనల మేరకు కొంత మోతాదులో వీటిని వాడాలి. 
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు ఉన్న వారు వెంటనే ఆస్పత్రుల్లో చేరాలి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాళ్లు చికిత్స తీసుకోవాలి. 
  • రోగులు గోరు వెచ్చని నీటిని పుక్కిలించడం చేయాలి. రోజుకు కనీసం రెండు సార్లు ఆవిరి పట్టాలి. 
  • హోం ఐసోలేషన్ లో ఉన్న వారు తప్పనిసరిగా మూడు లేయర్ల మెడికల్ మాస్క్ వినియోగించాలి. వీరి వద్దకు కుటుంబ సభ్యులు వస్తే అంతా ఎన్ 95 మాస్క్ ధరించాలి. 1 శాతం సోడియం హైపోక్లోరైట్ తో క్రిమిసంహారకం చేసిన తర్వాత మాత్రమే మాస్క్ లను తొలగించాలి. 
  • కరోనా బారిన పడిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లిక్విడ్ ఎక్కువగా తీసుకోవాలి. 

 

Leave a Comment