చైనా అధ్యక్షుడి బదులు కిమ్ దిష్టి బొమ్మ దహనం..బీజేపీ నేత నవ్వులపాలు..

భారత్ -చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  దేశంలో చైనాపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చైనా వస్తువులను బ్యాన్ చేయాలనే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. చైనా తీరుపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లో బీజేపీ కార్యకర్తలు చేసే ఓ ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుపూయిస్తోంది. 

చైనాకు వ్యతిరేకంగా అసన్సోల్ దక్షిణ మండల్-1 బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. లాద్దాఖ్ లో గాల్వన్ లోయలో జరిగిన ఘటనకు నిరసనగా చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. అసలు చైనా అధ్యక్షుడు ఎవరనేది తెలియకుండా దిష్టి బొమ్మను దహనం చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బదులు దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దిష్టి బొమ్మను తలగబెట్టారు. 

చైనాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని, చైనీస్ ప్రైమ్ మినిస్టర్ కిమ్ జొంగ్ ఉన్ దిష్టి బొమ్మను దహనం చేశామని అసన్సోల్ సౌత్ మండల్ 1 అధ్యక్షుడు తెలిపారు. ప్రజలందరూ చైనీస్ ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని, కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది..

Leave a Comment