ఏలూరు వింత వ్యాధికి కారణం అదే.. నివేదిక అందించిన శాస్త్రవేత్తలు..!

ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలపై శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారు. పురుగుల మందు అవశేషాలే ఈ పరిస్థితికి కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖాత సంస్థలు అభిప్రాయపడ్డారు. అవి మనుషుల శరీరాల్లోకి ఎలా ప్రవేశించాయన్న దానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని నిపుణులు పేర్కొన్నారు. అధ్యయన బాధ్యతలను న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సీఎం జగన్ అప్పగించారు.  

ఏపీ సీఎం జగన్ బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలన్నారు. ఏలూరు తరహా ఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 

 

Leave a Comment