ఆగస్టు 15 తర్వాత స్కూళ్లు, కాలేజీలు ఓపెన్..

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నుంచి స్కూళ్లు, కాలేజీలకు కేంద్రం మినహాయింపు ఇవ్వలేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాప్రణాళిక మార్చడానికి కేంద్రం కసరత్తు చేసింది. నూతన విద్యా సంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇక అందుకోసం నూతన మార్గదర్శకాలను త్వరలో అందించనుంది. 

ఇక ఈ సారి విద్యాసంవత్సరం ఆగస్టు 15 తర్వాత నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ నిశాంక పోఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు తరువాత స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరవబడతాయని స్పష్టం చేశారు. 

అయితే మొదటగా జులైలో పాఠశాలలు మరియు కళాశాలలను 30 శాతం హాజరుతో ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో తాజాగా ఆగస్టు తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోగా గత విద్యాసంవత్సరానికి సంబంధించిన పరీక్షలన్నీ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. 

Leave a Comment