బొడ్డుపై నూనె రాస్తే ఎన్నో ప్రయోజనాలు.. సంతానోత్పత్తి కూడా పెరిగే అవకాశం..!

మన పొట్ట మీద ఉన్న ‘నాభి’నే బొడ్డు అంటారు. బొడ్డు పొట్టపై లోనికి చొచ్చుకుని పొయినట్లు ఓ రంధ్రం ఆకారంలో ఉంటుంది. సంప్రదాయ భారతీయ యోగాలో బొడ్డును మానవ శరీరంలోని ఏడు ప్రధాన చక్రాలలో లేదా శక్తి బిందువులలో ఒకటిగా పేర్కొంటారు. వివిధ రుగ్మతలను నయం చేయడానికి ఆయుర్వేద వైద్యం బొడ్డులో వివిధ రకాల నూనెలను వేయాలని సిఫార్సు చేస్తుంది. బొడ్డులో నూనె వేయడం అనేది పురాతన పద్దతుల్లో ఒకటి..

బొడ్డులో ఒక చుక్క నూనె వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుతాయని పూర్వకాలంలో నమ్మేవారు. కాలక్రమేణా ఈ అలవాటు తగ్గిపోయింది. వాస్తవానికి బొడ్డుపై అప్పుడప్పుడు నూనెతో మసాజ్ చేసినా..రోజూ ఒక చుక్క నూనె వేసినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బొడ్డులో నూనె వేసుకోవడం వల్ల ప్రయోజనాలు:

  • బొడ్డు చుట్టూ నూనె రాయడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలైన అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం, వికారం వంటివి తగ్గుతాయి. ఎసెన్షియల్ ఆయిల్ తో పాటు అల్లంతో చేసిన నూనెను రోజూ పూయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. 
  • చాలా మంది స్నానం చేసేటప్పుడు బొడ్డును శుభ్రపరుచుకోవడం మరిచిపోతుంటారు. సన్ ఫ్లవర్ ఆయిల్ లేదా జోజోబా నూనెలను రెండు లేదా మూడు చుక్కలు దూదిపై వేసుకొని బొడ్డును శుభ్రపరుచుకోవాలి. అలా చేస్తే మురికి తొలగిపోతుంది. శరీరంలో నాభి కీలక పాత్ర పోషిస్తుంది. బొడ్డులో నూనె వేయడం, మసాజ్ చేయడం ద్వారా మిగతా శరీర భాగాలు చురుగ్గా పనిచేస్తాయి.  
  • ఎంతో మంది మహిళలు పిగ్మెంటేషన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు నిమ్మనూనెను ప్రతిరోజూ 2-3 చుక్కలు బొడ్డులో వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 
  • బొడ్డుకు తరచూ కొబ్బరి నూనె రాయడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది. గర్భాశయం, అండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్గానిక్ ఆలివ్ నూనెతో నాభిపై మసాజ్ చేసుకున్న కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు తరచూ బొడ్డులో ఒక చుక్క నూనె వేయడం, మసాజ్ చేయడం వంటివి చేసుకోవాలి. 
  • నాభి లోపల తడిగా ఉంటే రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు చేరుతాయి. అందుకూ నాభి ఎప్పుడూ పొడిగా ఉండాలి. బొడ్డు పొడిగా ఉండి.. బ్యాక్టీరియా చేరకుండా తరచూ నూనె రాస్తూ ఉండాలి. కొబ్బరి నూనె, ఆవ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. టీ ట్రీ ఆయిల్ కూడా మమర్థంగా పనిచేస్తుంది. ఈ నూనెలను బొడ్డుకు రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 
  • మహిళలకు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వేధిస్తుంది. తరచూ బొడ్డు చుట్టూ ఆముదం నూనె రాయడం, లేదా ఒక చుక్క వేసుకోవడం ద్వారా ఆ నొప్పి తగ్గుతుంది. ఎండోమెట్రియోసిస్ లక్షణాలు కూడా తగ్గిస్తుంది.  
  • ఆవ నూనె, ఆలివ్ నూనెలను బొడ్డులో వేసి మర్దనా చేస్తే కీళ్ల నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాక ఆవ నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం కూడా ఉంటాయి. ఇవి మంటలు, వాపులను తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థటైటీస్ వంటి సమస్యల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. 

Leave a Comment