మన చేతుల్లోనే బ్యాంక్…

సాంకేతిక అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ ఎన్నో సేవలు చెంతకు చేరుతున్నాయి. అందులో భాగంగానే లావాదేవీలు నగదు రహితంగా మారడంతో ఎంతో మంది ఊరట చెందుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో యాప్ లు అందుబాటులోకి  వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన యోనో యాప్ తో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అయ్యాయి.

ఎస్బీహెచ్ కూడా ఇందులో విలీనం చేయడంతో ఎస్బీఐ మరింత అతి పెద్ద బ్యాంకుగా అవతరించింది. ఇటీవల సేవింగ్ ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉంచాలనే నిబంధనను ఎత్తి వేయడంతో ఖాతాలు తెరిచేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 

స్మార్ట్ ఫోన్ తోనే అన్ని రకాల సేవలు..

స్మార్ట్ ఫోన్ చెంతనే ఉంటే అర చేతి నుంచే అన్ని రకాల బ్యాంకింట్ సేవలను పొందవచ్చు. yono app ద్వారా బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల సేవలతో పాటు లావాదేవీలు చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా ఈ యాప్ ద్వారా అందే సేవలపై ఖాతాదారులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారు. ఎస్బీఐలో సేవింగ్ ఖాతాతో పాటు స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరు ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

yono app ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడం చాలా సులభం. డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడీ, పాస్ వర్డ ను క్రియేట్ చేసుకోవచ్చు.  దీంతో అక్రమాలకు తావు ఉండదు. 

yono app ద్వారా ఉపయోగాలు..

yono app ద్వారా అకౌంట్స్ కు సంబంధించి అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాలెన్స్ తెలుసుకోవడం(ఎంక్వైరీ), అకౌంట్ స్టేమ్ మెంట్, నగదు బదిలీ, టీడీఆర్ / ఎస్టీడీఆర్ / ఆర్డీ, బిల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్, 15 జీహెచ్ సబ్ మిషన్, టీడీఎస్ ఎంక్వైరీ, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, బ్లాక్ ఏటీఎం డెబిట్ కార్డు, యాక్టివ్ ఎస్ఎంఎస్ అలర్ట్, చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టడం, ఆన్ లైన్ నామినేషన్, సేవింగ్ ఖాతా బదిలీ చేసుకోవడం వంటి సేవలు పొందవచ్చు. 

రుణాలు..

యోనో క్రిషి గోల్డ్ లోన్, కార్డు, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్లు, పెన్షనర్ లోన్స్, పీఏపీల్(డిజిటల్ లోన్స్, హోమ్ లోన్ టాప్ ఆప్, విద్య రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, చెక్ పేమెంట్లు నిలుపుదల చేయడం, ఐఎన్బీ పాస్ వర్డ్ రీసెట్టింగ్, ఆధార్/ పాన్ కార్డు లింకింగ్ వంటి సదుపాయాలను పొందవచ్చు. 

పెట్టుబడులు, బీమా సేవలు..

చిన్న పిల్లల బీమా ప్లాన్లు, వ్యక్తిగత ప్రమాద బీమా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మోటారు వాహనాల బీమా, ట్రావెల్ బీమా, దీర్ఘకాలిక హోమ్ ఇన్సూరెన్స్, షేర్లు, డీమాట్ ఖాతాలు, రీటైర్మెంట్ ప్లాన్స్, మ్యూచ్ వల్ ఫండ్స్, పెన్షన్ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, ట్రెడిషనల్ ప్లాన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటి సేవలు పొందవచ్చు. 

యాప్ నుంచే షాపింగ్..

yono app నుంచి ఐఆర్టీసీ టికెట్స్, అమెజాన్, టాటా, క్రోమా, ఓలా, యూబీఈఆర్, రైలు, విమానం, బస్ టెకెట్లు పొందడం, హోటల్ రూమ్ బుకింగ్, ఫ్యాషన్ లైఫ్ స్టైల్, ఫుడ్(స్విగ్గి, జుమోటో), ఫార్మసీ, జ్యూవెలరీ, బేబీ వరల్డ్, గిఫ్ట్స్, ఆటో మొబైల్స్, బుక్స్, రెడ్ బస్, విహార యాత్రలకు సంబంధించిన సేవలు పొందవచ్చు. 

ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్ డ్రా..

స్మార్ట్ ఫోన్ లో yono app ఉంటే ఏటీఎం కార్డు లేకుండానే రూ.20 వేల వరకు నగదు పొందవచ్చు. యోనో యాప్ ద్వారా ఏటీఎం మిషన్ నుంచి 500 నోట్లు మాత్రమే రూ.20 వేల వరకు వస్తాయి. యోనో యాప్ లాగిన్ అయి… యోనో క్యాష్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి ( యోనో యాప్ నుంచి పే లేదా క్విక్ లింక్స్), తర్వాత యోనో క్యాష్ అంటూ రిక్వెస్ట్ క్లిక్ చేయాలి.

అప్పుడు యోనో క్యాష్ లాండింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే సమీపంలోని యోనో క్యాష్ పాయింట్స్ క్లిక్ చేస్తే సమీపంలోని యోనో క్యాష్ పాయింట్స్ సమాచారం వస్తుంది. క్యాష్ విత్ డ్రా కోసం ఆరు అంకెల యోనో ఎంటర్ చేయాలి. తర్వాత ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత నగదు వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఏటీఎం కార్డు లేకుండానే నగదు పొందవచ్చు. 

 

Leave a Comment