సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు కొంచెం లాభం…కొంచెం నష్టం !

ఎన్నికల నిర్వహణ బాధ్యత ఈసీదే

తక్షణం ఎన్నికల నియమావళి ఎత్తివేయాలి

ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా కోడ్ అనవసరం

అభిప్రాయపడ్డ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే

స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, ప్రభుత్వానికి కొంచెం లాభం, కొంచెం నష్టం కలిగించేలా తీర్పు వెలువడింది. ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదేనని స్పష్టం చేసిన ధర్మాసనం, తక్షణమే ఎన్నికల కోడ్ ను తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, తిరిగి ఎన్నికల తేదీలను ప్రకటించేంత వరకూ అమలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో ఎన్నికల నియమావళి అమలులోనే ఉండటం సహేతుకం కాదని, దీని వల్ల పాలన కుంటు పడుతుందని కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పుతో ముందుగా ప్రకటించిన విధంగా ఉగాదికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసుకునే సౌకర్యం ప్రభుత్వానికి లభించనుంది. ఇదే సమయంలో రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

 

Leave a Comment