ఉచిత పథకాలతో ప్రమాదం.. SBI నివేదికలో విస్తుపోయే నిజాలు..!

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఉచిత పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ ఉచిత పథకాలు ప్రకటించడం అంత మంచిది కాదని స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఆర్థికంగా నిలకడలేని ఉచిత పథకాల వల్ల భవిష్యత్తులో ఆర్థిక విపత్తు సంభవించే అవకాశం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. 

రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థపై లోతైన ప్రభావాన్నిచూపిస్తాయని, ఇది ఆందోళనకర విషయమే అని ఎస్బీఐ రీసర్చ్ రిపోర్ట్ లో పేర్కొంది. తెలంగాణ సహా రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు తమ రెవెన్యూ ఆదాయంలో 5 నుంచి 19 శాతం రుణమాఫీ వంటి వఉచిత పథకాల కోసం ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. 

రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయంలో దాదాపు 53 శాతం ఉచితాలకు వెచ్చిస్తున్నాయని ఎస్బీఐ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో ద్రవ్యలోటు 4 శాతం దాటేసి ప్రమాదకర దిశగా ఉందని పేర్కొంది. బిహార్(8.3), అసోం(4.5) సహా ఏడు రాష్ట్రాలు వాటి బడ్జెట్ లో వేసుకున్న అంచనాలను దాటిపోయినట్లు తెలిపింది.  బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ ద్రవ్యలోటు ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా.. అప్పులు చేసి ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని.. ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తుతుందని సీనియర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

 

Leave a Comment